బండి సంజయ్‌కి జగ్గారెడ్డి సవాల్‌…హిందువుల కోసం పెట్రోల్‌ తగ్గిస్తావా !

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు.. హిందువుల కోసం తాను చెప్పిన 4 అంశాల పై చర్చకు సిద్ధమా…? అని సవాల్‌ విసిరారు జగ్గారెడ్డి. తెలంగాణ లో ఉన్న 80 శాతం హిందువుల కోసం బరాబర్ పని చేస్తానని చెప్పిన్నావు కదా.. మరి హిందువుల కోసం మోడీ తో మాట్లాడి పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు తగ్గించగలవా ? అని సవాల్‌ విసిరారు.

jaggareddy | జగ్గారెడ్డి

తెలంగాణ లో ఉన్న పేద హిందువులకు రూ. 15 లక్షలు మోడీ తో ఇప్పించగలవా ? నువ్వు తెలంగాణ లో ఉన్న 80 శాతం హిందువుల కోసం మాట మీద నిలపడుతావా ? అని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు జగ్గారెడ్డి. పాదయాత్రకు నిజాం భూములకు సంబంధం ఏంటి ? అని ప్రశ్నించారు. నిజాం భూములు తీసుకుని 80 శాతం ఉన్న హిందువులకు ఇస్తామని చెప్పగలరా..? రక్తం తాగే పులిలాంటి స్వభావం ఉన్న పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైకి గోవుల కాపాడుతూ హిందువులను రెచ్చగొడుతుందన్నారు. ప్రజల సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా హిందువులను రెచ్చగొడుతుందని నిప్పులు చెరిగారు. మతాల మధ్య గొడవలు కావాలా..! ప్రజలకు మేలు జరుగలా..! అని ప్రశ్నించారు.