పవన్‌ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్‌ : ఆయన ఒళ్లంతా బురదే !

-

పవన్‌ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని… తమ పాలిట గుదిబండ అయ్యారని ఇండస్ట్రీలో అందరూ పవన్ గురించి అనుకుంటున్నారని చురకలు అంటించారు. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై స్టేక్ హోల్డర్లు సంతోషంగా ఉన్నారని… సినిమాలతో వచ్చిన ఆదాయం అంతా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వెళ్లడం లేదని తెలిపారు. ఆన్ లైన్ వస్తే మోసాలకు అవకాశం ఉండదని.. బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని, దొంగ లెక్కలతో లబ్ధి పొందుతున్న కొద్ది మంది ఆందోళన చెందుతున్నారని నిప్పులు చెరిగారు.

ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రభుత్వానిది సహకార పాత్రేనని… ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను సినీ ప్రముఖులంతా ఆహ్వానిస్తున్నారన్నారు. టిక్కెట్ల రాబడితో ప్రభుత్వం లోన్లు తీసుకుంటారనడం అసంబద్దమైందని… ఆన్ లైన్ టికెట్ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకే వెళ్తుందని స్పష్టం చేశారు.

ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థ పై వారం పది రోజుల్లో విధి విధానాలు వచ్చే అవకాశం ఉందని… పారదర్శకంగా ఆన్ లైన్ వ్యవస్థ ఉండాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. సినిమా ధియేటర్లు నడిపే వ్యవహారం మాఫియాలాగా నడుస్తుందని… సినీ పెద్దలతో సమావేశానికి ఎప్పుడైనా సీఎం సిద్దంగా ఉన్నారన్నారు. చర్చలకు సినీ పెద్దలు ఎప్పుడు వచ్చినా ఆహ్వనిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version