హేమంత్ హత్య కేసులో ఎవరినీ వదిలేదు లేదు : సజ్జనార్

-

హేమంత్ కేసులో యుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి లను 6 రోజుల పాటు కస్టడీకి కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిన గచ్చి బౌలి పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలేది లేదని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుందని ఆయన అన్నారు.

ఆరు గంటలుగా హేమంత్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేసారు పోలీసులు. పోలీస్ ల ముందు అన్ని విషయాలు చెప్పానన్న అవంతి. పెళ్లి అయ్యాక నేను ఎక్కడ ఉన్నానో పోలీస్ లకు తెలుసని అన్నారు. ఇక ఇప్పుడు పోలీస్ లు నాకు తప్పకుండా రక్షణ కల్పిస్తారన్న ఆమె భవిష్యత్తులో హేమంత్ హత్య పై పోరాటం చేస్తానని అన్నారు. అవంతి , హేమంత్ పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి లైఫ్ త్రెట్ ఉందని మాకు చెప్పలేదన్న సజ్జనార్ చెప్పుంటే రక్షణ ఇచ్చేవాళ్ళమని అన్నారు. అవంతి రక్షణ కోరితే తప్పకుండా కల్పిస్తామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news