ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను వసూలు చేసింది.ఇదిలా ఉంటే…దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్- 2024లో ‘బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్’గా ‘సలార్’ నిలిచింది.కాగా ముంబైలో జరిగిన ఈ ఈవెంట్లో సినీనటులు సందడి చేశారు. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి కుమారి , శ్రీయ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.సలార్ పార్ట్ 2 స్టోరీ సిద్ధమైందని, త్వరలోనే సినిమాని సెట్స్ పైకి డైరెక్టర్ ప్రశాంతి చెప్పిన సంగతి తెలిసిందే.దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.