“సలార్” మూవీ రిలీజ్ పై ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ !

-

ప్రభాస్ హీరోగా మరియు సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజాగా చిత్రం “సలార్”, ఇద్దరూ పాన్ ఇండియా స్థాయి వారే కావడం వలన సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పెద్ద నటీ నటులు అంతా పాత్రధారులు కావడం వలన తెలుగు సినిమా ఎంతగానో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది. కానీ ఈ సినిమా మేకర్స్ ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ అందరికీ నిరాశనుఁ కలుగచేస్తునారు. వాస్తవంగా అయితే ఈ సినిమా వచ్చేవారం అనగా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా అవుట్ ఫుట్ ఏమంత సరిగా రాకపోవడంతో సంతృప్తి చెందని ప్రశాంత్ నీల్ అండ్ టీం తుది మెరుగులు దిద్దడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఏ సంవత్సరం సలార్ మూవీ రిలీజ్ అయ్యాయి అవకాశమే లేనట్లు స్పష్టంగా తెలుస్తోంది. సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ బాధలో ఉన్నారు.. ప్రభాస్ ను సలార్ లో చూడడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news