“సలార్” నుండి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న అప్డేట్ ?

-

టాలీవుడ్ హీరో స్థాయి నుండి ప్రపంచం మొత్తానికి తెలిసిన హీరోగా ఎదిగిన ప్రభాస్ కు చాలా కాలంగా కెరీర్ లో సరైన హిట్ పడలేదు. బాహుబలి 2 అనంతరం విడుదలైన సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ లు దారుణంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ ఫలితంగా ఇప్పుడు తన ఆశలు మరియు తనను ఎంతగానో ఆరాధించే ఫ్యాన్స్ ఆశలు అన్నీ కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ మీదనే ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రేపు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. వాస్తవంగా ఈ రోజున సలార్ రిలీజ్ కావలసి ఉండగా, అనుకోని కొన్ని కారణాల వలన రిలీజ్ ను నిలిపివేశారు. దీనితగో అందరూ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 22వ తేదీన సలార్ ను రిలీజ్ చేయవచ్చన్నది యూనిట్ ప్లాన్. మరి రిలీజ్ డేట్ అదేనా లేదా ఏదైనా మార్పు ఉంటుందా అన్నది తెలియాలంటే రేపు అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version