పురాతన కాలం నుండి కూడా పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం మనం చూస్తున్నాము. చాలా మంది ఇళ్లల్లో ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఎంత పెద్దగా ఎదిగినా పెద్ద వాళ్ళకి నమస్కారం చేయడం మన సంప్రదాయం. తల్లిదండ్రులకి, గురువులకి, తాతయ్య, నానమ్మలకు నమస్కారం చేస్తూ ఉంటాం. అలానే కొన్ని కొన్ని సార్లు శుభకార్యాలు వంటివి జరిగినప్పుడు నమస్కరించి అక్షతలు వేయించుకుంటారు.
ఏదైనా ముఖ్యమైన పని కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పెద్దల కాళ్ళకి దండం పెట్టి వెళ్తుంటారు. అయితే అసలు పెద్ద వాళ్ళ కాళ్ళకి నమస్కారం ఎందుకు చేయాలి..? దీని వెనుక ఉండే కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
మహాభారత కాలం నుండి కూడా ఇది వస్తోంది. పెద్దల కాళ్లకు నమస్కారం చేయాలని మహా భారతంలో కూడా ఉంది అయితే పురాతన కాలం లో మొదలైన ఈ పద్ధతి ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. మొట్టమొదట మహాభారతంలో ధర్మరాజు దీనిని మొదలు పెట్టారు.
పెద్దల పాదాలకు నమస్కారం చేయడం వల్ల మనకి శక్తి వస్తుంది. వాళ్ల ఆశీర్వచనాలు మనకి మంచి చేస్తాయి అందుకని పెద్ద వాళ్ల పాదాలకి నమస్కారం చేస్తారు. దీని వల్ల గొప్ప అనుభూతిని పొందవచ్చు. ఏదైనా సాధిస్తాననే నమ్మకం మనలో కలుగుతుంది. అలాగే మన పై పెద్ద వాళ్లకు మంచి భావన వస్తుంది. దీనితో సంబంధాలు కూడా బలపడతాయి. ఇందుమూలంగా పెద్దల పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటారు.