టాలీవుడ్ నటి సమంత ఇటీవల ఓ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను కూడా ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని సమంత తెలిపారు. ఎక్కువ దృష్టి మనపై ఉండటంవల్ల మనల్ని ఆందోళనకు గురి చేసే అంశాలు, బలహీనతలు, బాధలు వంటి వాటి గురించి మాట్లాడటం ఇబ్బందిగా మారుతుందని అన్నారు. పర్ఫెక్ట్ గా జీవించడం చాలా కష్టమైన పని అని.. నన్ను నమ్మండి ఎవరి జీవితము పర్ఫెక్ట్ గా ఉండదు అంటూ సమంత కామెంట్స్ చేశారు. కేవలం గ్లామర్ గురించి మాత్రమే కాదని, జీవితాల్లో బాధ ఇబ్బందికర పరిస్థితుల గురించి నాలాంటి వారు మాట్లాడితే ప్రజలు అంగీకరిస్తారు అని అనుకుంటున్నాను అని తెలిపారు.
తాను మానసిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు స్నేహితులు, కౌన్సిలర్ల సలహాలు సూచనలతో వాటి నుంచి బయటకు రాగలిగానని సమంత వెల్లడించారు. భవిష్యత్తులో తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎందుకంటే స్నేహితులు శ్రేయోభిలాషులు నాకు తోడుగా ఉంటారనే నమ్మకం ఉందని చెప్పారు. ఇబ్బంది పడే కన్నా మానసిక సమస్యలు ఇతరులతో పంచుకోవడం మేలు అని సమంత వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా సమంత రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేశారు. అదే విధంగా ప్రస్తుతం శాకుంతలం సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు.