SAMANTHA : లైఫ్‌ లో అది కచ్చితంగా కావాల్సిందే.. సమంత సంచలనం

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. ఇక ఇటీవలే స్విట్జర్లాండ్‌ ఎంజాయ్‌ చేసిన సమంత.. తిరిగి ఇండియా చేరుకుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సమంత క్రమశిక్షణ గురించి ఓ సంచలన పోస్ట్ చేసింది.

“క్రమశిక్షణ ఎందుకు అంత ముఖ్యమైనది ఎవరు మీకు చెప్పనక్కర్లేదు.క్రమశిక్షణ మనపై మనకు ఉన్న ప్రేమ కు బలమైన రూపం అని.. రాబోయే గొప్ప బహుమతులు కోసం ప్రస్తుత అందాలను విస్మరిస్తోందని…మీరు కోరుకున్నవన్నీ… చింతల ముని ప్రేమించండి”అంటూ ఆసక్తికర స్టేటస్ పెట్టుకుంది సమంత.

కాగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం హీరోయిన్ సమంత సినిమాల జోరు పెంచేసింది. ఇప్పటికే తను చేసిన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్… ఉ అంటావా మామ.. పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలు శాకుంతలం రూపొందుతోంది. దీంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో యశోద సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్ లోనూ రెండు సినిమాలు చేస్తోంది సమంత.

Read more RELATED
Recommended to you

Latest news