‘నరిష్‌ యు’లో సమంత పెట్టుబడులు

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతోంది. అందుకే కేవలం సినిమాలనే నమ్ముకోకుండా.. ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సమంత.. తాజాగా పోషకాహార ఉత్పత్తులను అందిస్తున్న నరిష్‌ యులో సినీ నటి సమంత పెట్టుబడి పెట్టింది. సీడ్‌ ఫండింగ్‌లో భాగంగా సమీకరించిన రూ.16.5 కోట్ల (2మి.డాలర్లు)లో ఆమె భాగస్వామ్యమూ ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఆమె పెట్టుబడి ఎంత అనే విషయాన్ని వెల్లడించలేదు.

ఇప్పటికే ట్రయంఫ్‌ గ్రూపునకు చెందిన వై.జనార్థన రావు, డార్విన్‌బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రోహిత్‌ చెన్నమనేని, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌, కిమ్స్‌ హాస్పిటల్స్‌ సీఈఓ అభినయ్‌ బొల్లినేని తదితరులు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు నరిష్‌ యు సహ వ్యవస్థాపకులు కృష్ణా రెడ్డి, సౌమ్యా రెడ్డి తెలిపారు. పాతకాలపు ఆహార పద్ధతులను పరిచయం చేయడంతోపాటు, కొత్త ఉత్పత్తులనూ అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమంత భాగస్వామ్యంతో మార్కెట్లో తమ ఉత్పత్తులకు మరింత ప్రచారం లభిస్తుందన్నారు.

క్వినోవా, చియా సీడ్స్‌ వంటి వాటిని భారత్‌కు పరిచయం చేయడంలో నరిష్‌ యు కీలక పాత్ర పోషించదని, తృణధాన్యాల ఆధారిత ఆహార ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని సమంత చెప్పుకొచ్చింది. మొక్కల ఆధారిత ‘మిల్లెట్‌ మిల్క్‌’ను విడుదల చేసింది. రాగి, జొన్న, ఓట్స్‌, సజ్జలతో దీన్ని తయారు చేసినట్లు, పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని సౌమ్యా రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version