సమంత చాలా హాట్ గా ఉంది : పుష్ప ఐటమ్ సాంగ్ పై రకుల్ కామెంట్ !

-

డిసెంబర్ 17 వ తేదీన విడుదలైన పుష్ప సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఇక ఈ సినిమాను వరుసగా టాలీవుడ్ స్టార్ లు చూస్తున్నారు. సినిమా చూడడమే కాకుండా పుష్ప కు రివ్యూ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుష్ప సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన బీభత్సంగా ఉందని… తనకు అది నచ్చిందని రకుల్ పేర్కొన్నారు.

పుష్ప లాంటి అద్భుతాలను సృష్టించగల శక్తి కేవలం సుకుమార్ కు మాత్రమే ఉన్నట్లు రకుల్ కొనియాడారు. అటు రష్మిక మందన కూడా చాలా బాగా నటించింది అంటూ రివ్యూ చేశారు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత పై మాత్రం స్పెషల్ గా రకుల్ ప్రీతిసింగ్ కామెంట్ చేసింది.

ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ హైలెట్ గా నిలిచింది అని… ఆమె ఆ పాటలో హాట్ హాట్ గా కనిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రకుల్ ప్రీతిసింగ్. అటు విలన్ గా ఫాహద్ పాజిల్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడని తెలిపింది. కాగా పుష్ప సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news