టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత.
ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అలాగే ఈ మధ్య జిమ్ లో చేసే వర్క్ ఔట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది సమంత. ఇందులో భాగంగానే తాజాగా సమంత వర్కౌట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో సమంత భారీగా బరువు ఎత్తడం తో పాటు వర్కౌట్స్ చేస్తోంది. సమంత పడుతున్న కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరు ఫిదావుతున్నారు. సమంత స్టార్ హీరోయిన్ గా ఎదగడం వెనుక ఇంత కష్టం ఉందా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.కాగా ప్రస్తుతం సమంత.. యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Our Queen @Samanthaprabhu2 Tookup @iTIGERSHROFF Challenge & Further Nominated @arjunk26 To Take Up The #AttackChallenge! 🔥😎❤️ #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/LWCmcxJTNm
— Troll Who Trolls Samantha™ (@TeamTWTS) March 29, 2022