100 సార్లు పడ్డాను.. ప్రతిసారి లేచి నిలబడ్డాను.. సమంత సంచలనం !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ లో సమంత…. ఎంజాయ్‌ చేస్తోంది. ముఖ్యంగా అక్కడ స్కీయింగ్‌ చేస్తున్న వీడియోలను క్యాప్చర్‌ చేసి.. ఎప్పటి కప్పుడు తన సోషల్‌ మీడియాలో పెడుతూ.. తన ఫ్యాన్స్‌ లో ఉత్సాహాన్నినింపుతోంది.

ఇక తాజాగా ఈ స్కీయింగ్‌ పై ఓ ఎమోషనల్‌ పోస్టు చేసింది సమంత. ” నేను బన్నీ వాల్‌ నా స్కీయింగ్‌ ప్రయాణాన్ని ప్రారంభించాను. 100 సార్లు పడిపోయాను. పడిన ప్రతి సారీ లేచాను . వదిలేయాలనే ఆలోచన చాలా సార్లు నా మనస్సలోకి వచ్చింది. కానీ సంతోషంగా ముందుకు సాగాను. బన్నీ స్లోప్‌ ల నుంచి రెడ్‌ రన్‌ పూర్తి చేయడానికి పట్టిన సమయం. దాని కోసం నేను చేసిన కృషిల నిజమైనదానిని కనుగొన్నాను” అంటూ సమంత పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news