లైఫ్ ఇంతకు ముందులా లేదు.. నెటిజన్ ప్రశ్నకు సమంత రిప్లై

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యతో గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. తన సినిమాల ప్రమోషన్స్‌కు సంబంధించి మాత్రమే పోస్టులు చేస్తోంది. తాజాగా ఇవాళ శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది సామ్. అనంతరం ట్విటర్‌లో కాసేపు నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తన లైఫ్ ఇంతకుముందులా లేదని బదులిచ్చింది సామ్.

ప్రస్తుతం తన జీవితం విభిన్నంగా ఉందని, అంతకు ముందులా లేదని సమంత చెప్పింది. అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు, తన కోసం వాళ్లు చేసే ప్రార్థనల వల్లే తాను ధైర్యంగా ఉన్నానని తెలిపింది. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన ఆమె తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ ‘‘మేడమ్‌ మీ జీవితం ఎలా సాగుతోంది’’ అని ప్రశ్నించగా.. ‘‘విభిన్నంగా ఉంది’’ అని సామ్‌ బదులిచ్చింది.

 

అనంతరం మరో నెటిజన్ ‘‘మేడమ్‌ మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతిరోజూ కోరుకుంటున్నాను. మళ్లీ మీరు బాక్సాఫీస్‌ సక్సెస్‌లు అందుకోవాలి. అలాగే విమర్శలను తిరిగి కొట్టాలి’’ అని కోరగా.. ‘‘మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలు’’ అంటూ సరదాగా సామ్ రిప్లై ఇచ్చింది. ‘‘మీరు శాకుంతలం ప్రాజెక్ట్ అంగీకరించడానికి కారణం ఏమిటి?’’ అని వేరొక నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘‘త్వరలో మీరే చూస్తారు కదా’’ అని చెప్పింది. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ సమంత థాంక్యూ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news