న్యూయర్‌ నైట్‌..ఒక్క రోజే స్విగ్గీలో మూడున్నర లక్షల బిర్యానీ ఆర్డర్లు.. ఇక కండోమ్స్‌ అయితే..

-

డిసెంబర్‌ 31 రాత్రి..అదేంటో ఈరోజు వస్తే చాలు.. అందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.. మన లైఫే రేపటితో మారిపోతుంది అనేంతలా ఎంజాయ్‌ చేస్తాం. అసలే ఈ సారి..శనివారం రావడం యువతకు, ఐటీ ఉద్యోగులకు మంచి ప్లస్‌ పాయింట్‌ అయింది.. పిచ్చపిచ్చగా ఎంజాయ్‌ చేశారు. న్యూ ఇయర్ (డిసెంబర్ 31) సందర్భంగా శనివారం ఒక్క రోజే స్విగ్గీలో మూడున్నర లక్షల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయట.. ఇది ఆల్‌టైమ్‌ రికార్డ్‌..

శనివారం సాయంత్రం 10.25 గంటలలోపే 3.5 లక్షల బిర్యానీలు డెలివరీ చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఇక ఇదే సమయంలోపు దేశవ్యాప్తంగా 61,000కు పైగా పిజ్జాల్ని కూడా డెలివరీ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. సాయంత్రం 07.20 గంటలలోపే 1.65 లక్షల బిర్యానీలు స్విగ్గీ డెలివరీ చేసింది. శనివారం డెలివరీ అయిన ఆర్డర్లలో బిర్యానీదే అగ్రస్థానం.

ట్విట్టర్‌లో స్విగ్గీ నిర్వహించిన ఒక పోల్‌లో 75.4 శాతం హైదరాబాదీ బిర్యానీకి ఆర్డర్లురాగా, లక్నోవీ బిర్యానీకి 14.2 శాతం, కోల్‌కతా బిర్యానీకి 10.4 శాతం ఆర్డర్లు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో బిర్యానీకి ఫేమస్ అయిన బావర్చి రెస్టారెంట్ శనివారం రోజు నిమిషానికి 2 బిర్యానీలు విక్రయించిందట.. అసలు హైదరాబాద్‌ బిర్యాని అంటే ఎందుకు ఫేమస్‌ అంటారో.. ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండే వాళ్లకు తెలియకపోవచ్చు.. ఒకసారి బయట రాష్ట్రాల్లో బిర్యానీ తింటే తెలుస్తుంది.. ముఖ్యంగా నార్త్‌ సైడ్‌ బిర్యానీ తింటే.. మన హైదరాబాద్‌ బిర్యాని విలువ బాగా తెలుస్తుంది.. హైదరాబాద్‌లో ఉంటూ.. వీకెండ్స్‌లో బిర్యానీ తింటూ ఎంజాయ్‌ చేసేవాళ్లు నిజంగా లక్కీ అనే చెప్పాలి..

మొత్తం 15 టన్నుల మాంసం వాడినట్లు స్విగ్గీ తెలిపింది. డొమినోస్ సంస్థ 61,287 పిజ్జాల్ని విక్రయించింది. శనివారం సాయంత్రం ఏడు గంటల లోపు 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయని స్విగ్గీ పేర్కొంది.. స్విగ్గీ గ్రాసరీ సర్వీస్ అయిన ఇన్‌స్టామార్ట్ ద్వారా శనివారం 2,757 డ్యురెక్స్ కండోమ్ ప్యాకెట్లను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. అలాగే రాత్రి 09.18 నిమిషాలలోపు 12,344 కిచిడీ ఆర్డర్డు కూడా వచ్చాయని కంపెనీ వివరించింది. అంటే మొత్తంమీద శనివారం అందరూ మాములుగా ఎంజాయ్‌ చేయలా..? విందు, మందు, చిందులతో ఊర్రూతలూగిపోయారనమాట..!! ఇంతకీ మీరు ఏం చేశారు..!

Read more RELATED
Recommended to you

Latest news