చైతూతో విడాకులపై సమంత సంచలన పోస్ట్‌ !

-

గత కొన్ని రోజులుగా అక్కినేని కోడలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత పై సోషల్‌ మీడియా లో దారుణంగా ప్రచారం కొనసాగుతోంది. ఎప్పుడైతే.. తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి అక్కినేని పేరు తొలగించిందో అప్పటి నుంచి.. నాగ చైతన్య కు విడాకులు ఇస్తుందని ప్రచారం సాగింది. టీవీ ఛానళ్లు, వెబ్‌ సైట్లు, సోషల్‌ మీడియాలో ఇలా అన్నిట్లో నాగ చైతన్య మరియు సమంత విడాకుల పై వార్తలు వచ్చాయి.

అయితే.. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ సమంత తన స్టైల్‌ లో స్పందించింది. సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లుపై పరోక్షంగా స్పందించింది సమంత. మీడియా, రియాలిటీ మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ.. మేమిద్దరం బాగానే ఉన్నాం. మీడియానే దానిని పెద్దది చేసి చూపిస్తుంది అన్నట్లుగా తన ఇన్‌ స్టా స్టోరీ లో పోస్ట్‌ చేసింది సమంత. ఇక ఇటీవల నాగ్‌ బర్త్‌ డే రోజు కూడా సమంత చాలా ప్రేమగా తన మామకు శుభాకాంక్షలు తెలిపింది. అయినప్పటికీ పుకార్లకు బ్రేక్‌ పడకపోవడంతో… స్వయంగా సమంతే రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version