Samantha : “పుష్ప”రాజ్ తో చిందులేయ‌నున్న రామ‌ల‌చ్చిమ్మి

-

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న చిత్రం పుష్ప‌. ఈ క్రేజీ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు నుంచే.. భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం నుంచి రోజుకో అప్డేట్ ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ.. ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది మూవీ యూనిట్. మాస్ ఎంట‌ర్ టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుందంటూ అభిమానుల‌ను ఊరిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. స్పెషల్ సాంగ్‌లో
స‌మంత మెరవనుంద‌ని టాక్.

అవును,..రంగమ్మ..మంగమ్మా అంటూ రంగస్థలంలో ఆడి పాడినా స‌మంత‌.. పుష్పలో ఐటమ్ సాంగ్ చేయబోతోందని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ అంటే సమంతకు మంచి గౌరవం వుంది. ఆ గౌరవంతోనే సమంత ఈ ఐటమ్ సాంగ్ కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది.

చైతూతో వివాహానికి ముందు పలు సినిమాల్లో సమంత గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజుగారి గది-2, ఓ బేబీ, మజిలీ వంటి సినిమాలలో సమంత క్యారెక్టర్ చాలా సున్నితంగా, మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ ప్ర‌క‌ట‌న‌తో సమంత మ‌ళ్లీ పాత పంథాలోని ప్ర‌యాణించ‌నున్న‌దా ? అనే చ‌ర్చ మొద‌లైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version