వెంటితెరపై మెస్మరైజ్ చేసేవారిని ఆడియన్స్ డెమీ గాడ్స్‌గా భావిస్తుంటారు. వారిని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఒక్కసారైనా వారితో మాట్లాడాలని, ఫొటో దిగాలని ఎదురుచూడని ఫ్యాన్ అంటూ వుండరు. అలాంటి అభిమానగనమే సమంత కూడా సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తున్న సామ్‌ని స్పామ్ కాల్స్‌తో వేధిస్తున్నారట. గత కొంత కాలంగా ఆ కారణంగానే సమంత ఫోన్ ని వాడటం మానేసినట్టు తెలిసింది.
తనకు తెలియని వాళ్లు తనకు ఫోన్ చేస్తున్నారట. ప్రతీ సెకండ్ కొకసారి వచ్చే మూడవ కాల్ నాకు తెలియని వ్యక్తుల నుంచే వస్తోందని, అలాంటి కాల్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బందకరంగా వుంటోందని ఆ కారణంగానే తాను గత కొన్నేళ్లుగా మొబైల్ ఫోన్ వాడటమే మానేశానని ఇటీవలే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సమంత వెల్లడించింది. గతంలో ఫుడ్ ఆర్దర్ చేసిన సమయంలో డెలివరీ బాయ్ వచ్చి వెళ్లిన తరువాత చాలా మంది తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీరు సమంతేనా? ఇది సమంత నంబరేనా అని యక్ష ప్రశ్నలేసేవారట.
అంతేనా ఆ తరువాత రోజు కూడా మరో ఏడుగురు ఫోన్ చేశారట. తనకు ఫోన్ చేసి నంబర్ కన్ఫర్మ్ చేసుకున్న వ్యక్తి ఆ నంబర్‌ని తన స్నేహితులకు షేర్ చేయడంతో వాళ్ల కూడా వరుసగా ఫోన్ చేసి విసిగించేవారు. దాంతో ఈ టార్చర్ భరించలేక ఎన్ని ఫోన్ నంబర్లు మార్చానో గుర్తు లేదని సమంత వెల్లడించింది.