“లవ్ స్టోరీ” ట్రైలర్ పై సమంత సంచలన ట్వీట్ !

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా “లవ్ స్టోరీ”. ఈ సినిమా కు శేకర్ కమ్ముల దర్శకత్వం వహించగా చైతూ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు పాటలు విడుదలవగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈరోజు చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెలంగాణ యాసలో చైతూ, సాయి పల్లవి ఆకట్టుకున్నారు. అయితే ఈ లవ్ స్టోరీ ట్రైలర్ పై అక్కినేని సమంత సంచలన ట్వీట్ చేశారు. తన భర్త అయిన హీరో నాగచైతన్య ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. లవ్ స్టోరీ సినిమా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు సమంత. అంతేకాదు ఈ ట్వీట్ లో హీరోయిన్ సాయి పల్లవి ని మాత్రమే టార్గెట్ చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు సమంత. ఇక ఈ ట్వీట్ కు సాయి పల్లవి థాంక్యూ అంటూ రిప్లై కూడా ఇచ్చింది. కాగా నాగ చైతన్య మరియు సమంత విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.