హర్యానాలో దారుణం.. మహిళపై కుటుంబ సభ్యులు గ్యాంగ్ రేప్

మన దేశంలో రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా… మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మొన్న హైదరాబాద్ లో ఎనిమిదేళ్ల బాలికపై దాడి… మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానా రాష్ట్రంలోని… ఓ మహిళ పై ఏకంగా ఎనిమిది మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

అంతేకాదు ఆ వివాహిత పై అనేక నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు ఆఅ దుండగులు. బాధితురాలు హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానా పోలీసుల ప్రకారం, మామతో సహా ఎనిమిది మంది ఆ బాధిత మహిళ పై పలుమార్లు గ్యాంగ్ రేప్ చేసారు.

కట్నం కోసం తరచూ బాధితురాలి భర్త వేధించేవాడని… ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య గొడవ వచ్చేదని పోలీసులు తెలిపారు. ఇక కట్నం తేవకపోవడం తో…. ఆ మహిళపై భర్త కుటుంబ సభ్యులే ఎనిమిది మంది దారుణంగా రేప్ చేశారనీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసుకున్నామని స్పష్టం చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.