ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి గుడిలో యాగం చేస్తూ కనిపించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో యాగం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కూడా ఈ యాగం ఎందుకు చేస్తున్నారు.. అనే విషయానికి వస్తే.. సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక దేవాలయంలో వీరిద్దరూ యాగం చేస్తున్నట్టు సీన్ షూటింగ్ చేశారు.
అయితే ఇప్పుడు ఆ వీడియో క్లిప్ కాస్త బయటకు రావడంతో అది నెట్టింట చాలా వైరల్ గా మారింది. ప్రస్తుతం ఖుషి సినిమా క్లైమాక్స్ సన్నివేశాల షెడ్యూలు జరుగుతున్న నేపథ్యంలో దేవాలయంలో యాగం చేస్తున్న సీన్ ఒకటి తాజాగా షూట్ చేయడం జరిగింది. అందులో చీర కట్టులో సమంత ,పంచ కట్టుకున్న విజయ్ దేవరకొండ అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటగా మనకు కనిపించారు. ఇకపోతే వీళ్ళతో కుటుంబ సభ్యులు అంతా కలిసి కూడా యాగం చేస్తున్నట్లు మనం చూడవచ్చు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కాశ్మీర్ బ్యాక్ గ్రౌండ్ లో ముస్లిం యువతి పాత్రలో సమంత అలాగే ఆమెను ప్రేమించే హీరో పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి ఎండ్ కార్డు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ ఒకటవ తేదీన పలు భాషలలో విడుదల చేయబోతున్నారు మేకర్స్.
Wrapping up their final Schedule #VijayDeverakonda #Samantha #kickrajwritings pic.twitter.com/MZw5xoQmQ6
— kickraj_official (@goparaj228) July 5, 2023