నేడు ఆడ మగ అన్న తేడా లేకుండా ఎవరికీ వారు ఇష్టం వచ్చినట్లు మద్యం తీసుకుంటున్నారు. అయితే మగవారు ఎక్కువగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే, కానీ కొందరు మహిళలు సైతం మద్యం తీసుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. కాగా ఇలాంటి మద్యం తాగే ఆడవారి గురించిన ఒక విషయం గురించి ఇప్పుడు చూద్దాం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆడవారు మద్యం తాగితే.. పిల్లలు పుట్టరు అన్న సందేహం చాలా మందిలో ఉంది.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవంగా ఆడవారు మద్యాన్ని తాగితే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ లపై విపరీతమైన ప్రభావం పడుతుందట. ఇది మహిళలలో గర్భధారణ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని గైనకాలజిస్ట్ లు సలహాలు ఇస్తున్నారు. ఇంకా తక్కువగా మద్యం తీసుకునే వారికి ఏమీ ఇబ్బంది ఉండదని… ఒక వారంలో 14 సార్లు మద్యం తీసుకుంటే వారిలో 25 శాతం గర్భం ధరించే అవకాశాలు తగ్గిపోతాయట.