హోటల్ రూమ్లో స్టార్ హీరోయిన్ తో అడ్డంగా బుక్ అయిన సమంత మాజీ లవర్..వీడియో వైరల్..!!

-

సమంత మాజీ లవర్ అనగానే టక్కున గుర్తొచ్చే హీరో.. యంగ్ హీరో సిద్ధార్థ్.. 2000 సంవత్సర కాలంలో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకొని.. స్టార్ రేంజ్ ని అందుకున్నాడు సిద్ధార్థ్. అటు తమిళ్ ఇటు తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ డం ను ను సొంతం చేసుకున్న ఈయన తెలుగులో రెండు మూడు ఫ్లాప్స్ పడినప్పటికీ కూడా ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక తమిళ్ , హిందీ భాషా చిత్రాలలో కూడా నటించి అత్యధిక సినిమాలు చేసి అక్కడ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేసిన మహాసముద్రం.. మరో హీరో శర్వానంద్ తో కలిసి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించారు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే సిద్ధార్థ క్యారెక్టర్ ను డైరెక్టర్ సరిగ్గా రాయకపోవడం వల్ల ఈ సినిమా ఆ స్థాయిలో ఫ్లాప్ అయిందని సినీ విశ్లేషకులు కూడా అంటూ ఉంటారు. ఈ సినిమాలో ఆయనకు జోడిగా అతిధి రావు హైదరి నటించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఈ క్రమంలోని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే తాజాగా సిద్ధార్థ హీరోయిన్ అతిధి రావు హైదరి తో డేటింగ్ లో ఉన్నాడని వార్త బాగా వైరల్ అవుతోంది. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.ఇటీవల ముంబైలో ఉన్న ఒక హోటల్ రూమ్ నుంచి వీరిద్దరూ ఒకేసారి బయటకు రావడంతో ఈ రూమర్స్ కి బలం చేకూరింది. ఇక మీడియా రిపోర్టర్స్ ఫోటోలు తీయడం చూసిన సిద్ధార్థ వారిపై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news