కేసీఆర్‌ ఈ రోజు నాలుక మడతేశారు : రేవంత్ రెడ్డి

-

గత సోమవారం వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుపై బీజేపీ పాలిత ప్రాంతాల్లో మినహా రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈనేపథ్యంలోనే.. జీఎస్టీ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జీఎస్టీకి మద్దతుగా గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని… ఆ సందర్భంలో మోదీని కేసీఆర్ పొగిడారని అన్నారు.

Priority to Congress workers in welfare schemes, says Revanth Reddy- The  New Indian Express

ఆరోజు మోదీని పొగిడిన కేసీఆర్… ఈరోజు నాలుక మడతేశారని విమర్శించారు. జీఎస్టీకి నాడు ఎందుకు మద్దతిచ్చారు? నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని ప్రశ్నించారు. పాలు, పెరుగుపై పన్ను వేస్తుంటే జీఎస్టీ మండలిలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందా? అని అడిగారు. ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు రేవంత్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news