సమంత హెల్త్ కండిషన్ సీరియస్.. బెటర్ ట్రీట్మెంట్ కోసం సౌత్ కొరియా వెళ్లనున్న హీరోయిన్..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజుల క్రితం తాను మాయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చింది.. ఈ న్యూస్ తో ఆమె అభిమానులంతా ఎంతో హైరానా పడ్డారు.. అయితే మరలా ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందంటూ సమంత చెప్పాక ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు సమంత. తాజాగా ఆమె తన ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి తో బాధపడుతున్నట్టు తెలిసిందే.. ఈ విషయంపై ఆమె అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం సమంత తొందరగా కోలుకొని మళ్ళీ సినిమాలు చేయాలంటూ ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్టు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నట్టు సమంత చెప్పుకొచ్చారు. అయితే సమంత ఎంతో స్ట్రాంగ్ పర్సన్ అని.. వీటన్నిటిని ఏమీ కాకుండా దాటుకుంటూ వస్తుందని అందరూ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య సమంత ఎక్కువగా కనిపించడం లేదు.. గత కొద్ది రోజుల క్రితం విడుదలైన ఆమె యశోద చిత్రం ప్రమోషన్స్ లో కూడా కనిపించని సమంత.. ఆ చిత్రం రిలీజ్ కు ముందు ఒక ఇంటర్వ్యూలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత నుంచి మళ్లీ మీడియం ముందుకు రాలేదు. అయితే తాజాగా ఆమె హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు వార్తలు రాగా.. వీటిని కొట్టిపారేశాడు ఆమె మేనేజర్. అయితే ఇప్పుడు మాత్రం సమంత ఆరోగ్యం కొంచెం సీరియస్గా ఉన్నట్టు.. అందుకే ఆమె బెటర్ ట్రీట్మెంట్ కోసం సౌత్ కొరియా వెళ్తున్నట్టుగా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.. ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ కోసం సమంతని ఆమె తల్లిదండ్రులు దక్షిణకొరియాకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడే కొన్ని రోజుల పాటు సమంత ఉండనుంది అని సమచారం.. అయితే అసలు విషయం ఏంటి అని తెలియాలి అంటే సమంత నుంచి కచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రావాల్సిందే. అయితే తీవ్రమైన కండరాలను నొప్పిగా పరిగణించే మయోసైటిస్ వ్యాధిలో సమంత థర్డ్ స్టేజ్ లో ఉన్నట్టు తెలిసిందే.. ఈ వ్యాధిలో విపరీతంగా కాలు చేతులు నొప్పులతో పాటు.. తీవ్రమైన అలసట ఉంటుంది. దీనికి ఖచ్చితమైన వైద్యం కూడా లేదు.. అలాగే ఎప్పుడు నయం అవుతుందో వైద్యులు కూడా చెప్పలేరు..

Read more RELATED
Recommended to you

Latest news