పూంచ్ సెక్టార్‌లో హృదయ విదారక దృశ్యాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పూంచ్ సెక్టార్‌లో నిన్న ఉదయం నుండి భారీ ఎత్తున కాల్పులు జరుపుతున్నాయి పాక్ ఆర్మీ. పాక్ ఆర్మీ కాల్పుల్లో నలుగురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు.

కాగా పాకిస్తాన్ దేశానికి చెందిన 14 మంది సైనికులను చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. తాజాగా పాక్ ఆర్మీ వాహనం పై రిమోట్ కంట్రోల్ తో IED బాంబును పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ ప్రాాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్. ఈ నేపథ్యంలో ఏకంగా 14 మంది పాకిస్తాన్ సైనికులు మంది మృతి చెందారు. ముచ్ కుంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. బుధవారం అందరూ నిద్రిస్తున్న సమయంలో పాకిస్తాన్ లోని ఉగ్రమూకలు ఉన్న 9 స్థావరాల్లో భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు దాదాపు 100 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రశిబిరాల పై భారత్ దాడి చేసింది. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటాక్ చేసింది.