తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. బుధ వారం రాత్రి 10 : 47 గంటలకు సారలమ్మ గద్దెలపై కొలువైంది. కన్నె పల్లి నుంచి సారలమ్మను పసుపు – కుంకుమ భరిణిల రూపంలో తీసుకువచ్చి గద్దె పై ప్రతిష్టించారు. తాజా గా సమ్మక్కను కూడా చిలకల గుట్ట నుంచి ఊరిగింపుగా తీసుకువస్తున్నారు. సమ్మక్క కు స్థానిక కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్వాగతం పలికారు. అంతే కాకుండా.. గౌరవ సూచికంగా గాలిలోకి స్థానిక ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ 10 రౌండ్ల కాల్పులు జరిపారు.
ఈ రోజు రాత్రి వరకు సమ్మక్కను గద్దెల పైకి తీసుకువస్తారు. అనంతరం గద్దె లపై సమ్మక్కను పత్రిష్టింస్తారు. దీని తర్వాత సమ్మక్క కు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే అమ్మవార్లను తీసుకురావడానికి ముందే పూజారులు.. గద్దెల వద్ద శుద్ధి పూజాలు చేశారు. శుద్ది పూజాల అనంతరమే సమ్మక్క సారలమ్మలను గద్దెలపై ప్రతిష్టింప చేస్తారు. కాగ రేపటి నుంచి సమ్మక్క – సారలమ్మ.. భక్తులకు దర్శనం అవుతారు.