దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ శాంసంగ్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ ఏ51 పేరుతో శాంసంగ్ ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.23,999గా నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, శాంసంగ్ స్టోర్లలో ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లే, ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే… ఇందులో మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి. వెనకవైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో నాలుగు కెమెరాలను అందిస్తున్నారు. సెల్పీ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంచారు. 4,000ఎంఏహెచ్ సామర్థ్యంతో 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని అమర్చారు. గెలాక్సీ ఏ51 ధరను రూ.23,999గా సంస్థ నిర్ణయించింది. ప్రిసమ్ క్రష్ బ్లాక్, వైట్, బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.