శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎం31 ప్రైమ్ పేరిట మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఎం సిరీస్‌లో వచ్చిన తాజాగా గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. గెలాక్సీ ఎం31 ఫోన్‌లో ఉన్న ఫీచర్లనే దీంట్లోనూ అందిస్తున్నారు. కానీ ఈ ఫోన్‌తో 3 నెలల కాలవ్యవధి గల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. ఈ ఫోన్‌లో అమెజాన్‌కు చెందిన పలు యాప్‌లను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.
గెలాక్సీ ఎం31 ప్రైమ్ స్పెసిఫికేషన్స్…
* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్పినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్
* 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 64, 8, 5, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
గెలాక్సీ ఎం31 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ఓషియన్ బ్లూ, స్పేస్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ రూ.16,499 ధరకు అమెజాన్‌లో అక్టోబర్ 17 నుంచి లభ్యం కానుంది.