గెలాక్సీ ఎ51, ఎ71 ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన శాంసంగ్

-

శాంసంగ్ సంస్థ త‌న గెలాక్సీ ఎ51, ఎ71 స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. గెలాక్సీ ఎ51కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.25,250 ఉండ‌గా, దీని ధ‌ర రూ.1251 త‌గ్గింది. దీంతో ఈ వేరియెంట్‌ను ప్ర‌స్తుతం రూ.23,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.27,999 ఉండ‌గా, దీని ధ‌రను రూ.2వేలు త‌గ్గించారు. దీంతో ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం రూ.25,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

ఇక గెలాక్సీ ఎ71 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.32,999 ఉండ‌గా దీని ధ‌ర‌ను రూ.2వేలు త‌గ్గించారు. దీంతో ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం రూ.30,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. కాగా ప్ర‌స్తుతం త‌గ్గించిన ధ‌ర‌ల‌కే ఈ ఫోన్ల‌ను విక్ర‌యిస్తున్నారు.

గెలాక్సీ ఎ51 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఎగ్జినోస్ 9611 ప్రాసెస‌ర్‌, 48, 12, 5, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

గెలాక్సీ ఎ71 స్మార్ట్ ఫోన్‌లో… 6.7 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 730 ప్రాసెస‌ర్‌, 64, 12, 5, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version