సోషల్ మీడియాలో కంటెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ప్రసార భారతి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 7 ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. న్యూఢిల్లీలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 20వ తేదీ వరకు దరఖాస్తులకు ఆఖరి గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
ముఖ్యమైన వివరాలు…
* మొత్తం ఖాళీలు – 7
* దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ – జూలై 20, సాయంత్రం 5 గంటల వరకు
* జీతం – రూ.20వేల నుంచి
* విద్యార్హత – జర్నలిజంలో పీజీ డిప్లొమా లేదా పీజీ చేసి ఉండాలి
* అనుభవం – కనీసం ఒక ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు
* ఇతర నైపుణ్యాలు – హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సామర్థ్యం ఉండాలి
* వయస్సు – 30 ఏళ్లకు మించరాదు
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Deputy Director (HR),
Doordarshan News,
Room No.413,
Doordarshan Bhavan,
Tower-B, Copernicus Marg,
New Delhi – 110001.
మరిన్ని వివరాలకు https://prasarbharati.gov.in/ అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు.