స్మార్ట్‌ఫోన్ల‌ను శానిటైజ్ చేసే కొత్త డివైస్‌.. శాంసంగ్ నుంచి.. ధ‌ర ఎంతంటే..?

-

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర యాక్స‌స‌రీల‌ను శానిటైజ్ చేసే ఓ స‌రికొత్త డివైస్‌ను శాంసంగ్ లాంచ్ చేసింది. యూవీ స్టెరిలైజ‌ర్ పేరిట స‌ద‌రు డివైస్ ప్ర‌స్తుతం భార‌త మార్కెట్‌లో ల‌భిస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్లు, ఇయ‌ర్‌బ‌డ్స్‌, కీస్‌, స‌న్ గ్లాసెస్‌ను కేవ‌లం 10 నిమిషాల్లోనే శానిటైజ్ చేయ‌వ‌చ్చు. ఈ డివైస్‌కు ఓ బిల్టిన్ వైర్‌లెస్ చార్జ‌ర్‌ను అందిస్తున్నారు.

Samsung UV Sterilizer launched in India

యూవీ స్టెరిలైజ‌ర్ ఓ బాక్స్‌ను పోలి ఉంటుంది. అందులో ఫోన్లు లేదా ఇత‌ర వ‌స్తువుల‌ను ఉంచితే వాటిపై ఉండే 99 శాతం బాక్టీరియా, వైర‌స్‌లు నాశ‌నం అవుతాయి. ఈ డివైస్‌పై ఓ చిన్న బ‌ట‌న్‌ను ఏర్పాటు చేశారు. బాక్స్ లోప‌ల డివైస్‌ల‌ను ఉంచి మూత పెట్టి పైన ఉండే బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే చాలు. 10 నిమిషాల్లో లోప‌ల ఉన్న డివైస్‌లు శానిటైజ్ అవుతాయి. వాటిపై ఉండే సూక్ష్మ క్రిములు పూర్తిగా న‌శిస్తాయి. దాదాపుగా అన్ని ర‌కాల ఫోన్ల‌ను, ఇయ‌ర్‌బ‌డ్స్‌ను శానిటైజ్ చేసుకునేందుకు వీలుగా ఈ డివైస్‌ను తీర్చిదిద్దారు.

శాంసంగ్ యూవీ స్టెరిలైజ‌ర్‌ను వినియోగ‌దారులు శాంసంగ్ ఆఫ్‌లైన్ స్టోర్లు, ఆన్‌లైన్ స్టోర్లు, ఇత‌ర రిటెయిల్ స్టోర్స్‌లో రూ.3,599 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news