ఏపీలో నేటి నుంచీ అమ‌లు కానున్న‌ ఇసుక డోర్ డెలివరీ సౌకర్యం

-

ఏపీలో ఇసుక డోర్ డెలివరీ సదుపాయం నేటి నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఈ రోజు అమల్లోకి తీసుకురానున్నారు. మొదటగా కృష్ణా జిల్లాలో ఇసుకను డోర్ డెలివరీ చేయనున్నారు. . ప్రజలకు ఇసుకను అందించడం తోపాటు వారి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యాన్ని కూడా ఎపిఎండిసి బాధ్యత తీసుకుంది. ఇసుక కావాలనుకునే వారు వెబ్‌సైట్‌లో నిర్మాణ వివరాలను ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాప్ ద్వారా జిపిఎస్‌ను ట్యాగ్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో ఇసుకను బుకింగ్ చేసుకున్న తరువాత నేరుగా ఆ ప్రదేశానికి పంపిస్తుంది ఎపిఎండిసి.

వినియోగదారులు బుకింగ్‌ కోసం అయ్యే ఖర్చు, రవాణా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం వరకు టన్ను ఇసుకకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా ఛార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6, 30 కిలోమీటర్లకుపైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున ఛార్జీ చేయనున్నారు. ఇదిలా ఉంటే రాబోయే నాలుగు నెలల్లో ఎపిఎమ్‌డిసి ప్రతి నెలా 15 లక్షల టన్నుల చొప్పున మొత్తం 60,000 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలని భావిస్తోంది. దీంతో రాబోయే వర్షాకాలానికి 60,000 లక్షల టన్నుల ఇసుక సరిపోతుందని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news