బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పోలీసుల ఫైర్ అయ్యారు. రాష్ట్ర పోలీసులకు పాకిస్తాన్ పట్ల ఎందుకంత ప్రేమ అంటూ మండిపడ్డారు.జమ్ముకాశ్మీర్లోని పహెల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా తన కార్యాలయానికి వచ్చిపోయే వాళ్లు తొక్కుకుంటూ వెళ్లేలా పాకిస్తాన్ జెండాను నేలకు అతికిస్తే దాన్ని పోలీసులు తొలగిచండం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహెల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ క్యాండిల్ ర్యాలీ చేస్తూ మరోవైపు ఆ దాడికి నిరసనగా పాకిస్తాన్ జెండాలు పెడితే వాటిని తొలగించాలని ఆదేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు.ఈ రకమైన రాజకీయం రేవంత్ రెడ్డి, పోలీసులకు మంచిదికాదన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.