సందీప్ రెడ్డి వంగా తర్వాతి చిత్రం “ఆనిమల్”.. బాలీవుడ్ హీరోతో.

-

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆ తర్వాత అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడూ. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంతో సందీప్ రెడ్డికి బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ వచ్చేసింది. దాంతో సందీప్ రెడ్డి తర్వాతి చిత్రం బాలీవుడ్ లోనే ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. రణ్ బీర్ కపూర్ హీరోగా డేంజర్ అనే టైటిల్ తో సినిమా మొదలవ్వనుందని అన్నారు. ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ సందీప్ రెడ్డి నుండి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.

తాజా సమాచారం ప్రకారం, సందీప్ రెడ్డి చిత్రం పట్టాలెక్కనుందని తెలుస్తుంది. రణ్ బీర్ కపూర్ హీరోగా “ఆనిమల్” పేరుతో సినిమా ఉండనుందట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని, మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుందని వినిపిస్తుంది. ఇప్పటి వరకూ రణ్ బీర్ కపూర్ కనిపించనటువంటి విభిన్నమైన పాత్రలో ఆనిమల్ సినిమాలో కనిపిస్తాడట. మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news