మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అక్రమ అరెస్ట్ కు నిరసనగా సంగారెడ్డి జిల్లా బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రోడ్లపై టైర్లను కాల్చుతూ నిరసన తెలుపుతున్నారు. సోమవారం రాత్రి పటాన్ చెరులో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులు బనాయించి రాజకీయ లబ్ది కోసమే అరెస్ట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.