మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

-

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్

నకిలీ పాస్ పోర్ట్, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు అభియోగం

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని హైదరాబాద్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా), నకిలీ డాక్యుమెంట్ల సాయంతో భార్య, పిల్లలుగా పేర్కొంటూ ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకెళ్లడం వంటి అభియోగాల కారణంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్లు నార్త జోన్ డీసీపీ బి. సుమతి తెలిపారు.

2004లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకలీ డాక్యుమెంట్లు, తప్పుడు సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకెళ్లారు..కొద్ది రోజుల తర్వాత జగ్గారెడ్డి మాత్రమే తిరిగి భారత్ కి వచ్చారని డీసీపీ వివరించారు. తన అధికారిక లెటర్ ప్యాడ్లో పేర్కొన్న విధంగా జగ్గారెడ్డి కుమారుడు వయస్సు నాటికి నాలుగేళ్లు అయితే తప్పుడు సమాచారంతో 17 ఏళ్లుగాను, తన భార్య వయస్సును సైతం తప్పుగా నమోదు చేయడంతో పాటు విప్ హోదాలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని డీసీపీ సుమతి వివరించారు. తమకు అందిన సమాచారం ప్రకారం ముందస్తుగా పాస్ పోర్ట్ కార్యాలయంలో సంబంధిత దస్త్రాలను పరిశీలించిన తర్వాతే ఆయన్ను అరెస్ట్ చేస్తున్నామని ..ఈ సందర్భంగా జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490,467, 468,471 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

రాజకీయ కుట్రలో భాగమే…

తన భర్త జగ్గారెడ్డిని రాజకీయ ప్రయోజనం కోసమే కుట్రపన్ని అరెస్ట్ చేశారని ఆయన భార్య నిర్మల ఆరోపించారు. జగారెడ్డి అరెస్ట్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకూ, తన పిల్లలకూ ఏవిధమైన పాస్ పోర్ట్ లు లేవని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news