విడాకులు తీసుకోనున్న సానియా మిర్జా ?

-

 

టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా విడాకులు తీసుకుంటున్నారా..? అంటే అవుననే తెలుస్తోంది. టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా.. పాక్‌ మాజీ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ.. టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా.. ఇండియా తరఫునే టెన్నిస్‌ ఆడుతోంది.

అయితే.. తాజాగా టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, షోయబ్‌ మాలిక్‌ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కచ్చితమైన కారణం తెలియకపోయినా.. వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే..ఈ జంట విడాకులకు సిద్ధమైందని తెలుస్తోంది. దీనిపై మీడియోలోనూ రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా స్పందించలేదు. దీనిపై ఆమెను ప్రకటన చేస్తే, ఈ వార్తలకు చెక్‌ పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version