టీమిండియా కీపర్ సంజూ శాంసన్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అతన్ని టీమిండియా జట్టు కోసం ఎంపిక చేయకపోవడంతో.. అతని ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే తాజాగా సంజూ కు ఐర్లాండ్ దేశం బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం అందుతోంది.
తమ దేశం తరఫున ఇంటర్ నేషనల్ క్రికెట్ ఆడాలని శాంసన్ కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆహ్వానం పంపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ, టీమిండియాతో తెగదెంపులు చేసుకుని తమ దేశానికి వస్తే, తమ జట్టు ఆడే అన్ని ఇంటర్ నేషనల్ మ్యాచ్ లు ఆడిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఆ ఆఫర్ ను సంజూ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాను టీమిండియాకే ఆడుతానని చెప్పినట్లు తెలుస్తోంది.