తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలకు దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని గత కొద్ది రోజుల నుంచి పుకార్లు.. వస్తున్నాయి. ఇటీవల పలు న్యూస్ పేపర్లలలో కూడా గురుకులాల్లో దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వచ్చాయి. కాగ ఈ వార్తలను తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు గురుకులాలకు సన్న బియ్యమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ప్రతి నెల పాఠశాలలకు 3 వేల మెట్రిక్ టన్నులు, సంక్షేమ హాస్టల్స్, గురుకులాలకు 14,000 మెట్రిక్ టన్నులు సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. పాఠశాలలకు, హాస్టల్, గురుకులాలకు బియ్యాన్ని పంపిణీ చేసే ముందు.. గోడౌన్లల్లో ఎంఈవో, హాస్టల్ ఇంఛార్జీల సమక్షంలో నాణ్యత పరీక్ష చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా.. దొడ్డు బియ్యం అంటూ నిందలు వెస్తున్నారని మండిపడ్డారు.