ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్.. ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ముంబై ఓపెనర్లు.. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరు తొలి వికెటుకు 50 రన్స్ జత చేశారు. అనంతరం ఇద్దరు వెనువెంటనే అవుట్ అయ్యారు. తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (8) నిరాశ పర్చాడు.
కానీ సుర్య కుమార్ యాదవ్ ( 37 బంతుల్లో 68 నాటౌట్ ) పరుగులు చేసి ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 5 ఫోర్లు, 6 సిక్స్ లతో మోత మోగించాడు. తిలక్ వర్మ (0), పోలార్డ్ (0), రమన్ దీప్ సింగ్ (6) విఫలం అయ్యారు. ఉనాద్కాట్ (13 నాటౌట్) ఉన్నాడు. దీంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లు.. హసరంగా, హర్షల్ పటేల్ తల రెండు వికెట్లు తీశారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు. బెంగళూర్ విజయం సాధించాలంటే.. 152 పరుగులు చేయాల్సి ఉంది.