నిరుపేదల విషయంలో గొప్ప మనస్సు చాటుకున్న సారా అలీఖాన్..!

-

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంది. సారా అలీఖాన్ పేరు నిత్యం ఏదో ఒక విషయంలో నెట్టింట మార్మోగుతూ ఉంటుంది. ఆమెను ట్రోలర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా స్టార్ కిడ్ అయినప్పటికీ సాదాసీదాగా ఉంటూ కొన్నిసార్లు మంచి మనసు చాటుకుంటుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ సంపాదించుకుంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటుంది అయితే సార ఇటీవల ‘ae watan mere watan’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, సారా అలీఖాన్ నిరుపేదలకు ఫుడ్ సప్లై చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ సాధారణ అమ్మాయిలా రోడ్డు పక్కన ఉన్న వారిని ప్రేమగా పలకరిస్తూ వారికి ఆహారం అందించింది. దీంతో వారు ఆకలి తీర్చినందుకు ఆమె దీవించారు. ప్రస్తుతం సారా వీడియో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news