అక్టోబర్ 31వ తేదీన సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోడీ

-

గుజరాత్‌లో మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి, దివంగత నేత సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమని గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ విగ్రహాన్ని అక్టోబర్ 31వ తేదీన సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారని గుజరాత్ సీఎం విజయ్ రుపాని వెల్లడించారు.

గుజ‌రాత్‌లో నిర్మాణ‌మ‌వుతున్న స‌ర్దార్ పటేల్ భారీ విగ్ర‌హం

గుజరాత్‌లో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు కాగా ఆ విగ్రహం దేశ సమైక్యతకు, పరిపూర్ణతకు చిహ్నంగా నిలుస్తుందని విజయ్ రుపాని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ఇప్పటికే నామకరణం చేసింది. 2013లో మోడీ సీఎంగా ఉన్నప్పుడే ఈ విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం అయిన విజయ్ రుపాని దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇనుము, మట్టి, నీళ్లు తదితర పదార్థాలను సేకరించి విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తాము సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుంటే కొన్ని శక్తులు ఆ విగ్రహాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నాయని, అయినప్పటికీ ఆ విగ్రహం దేశ సమైక్యతను చాటుతుందని సీఎం రుపాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version