‘సరిలేరు’ ఈవెంట్: ” బ్లాక్ బస్టర్ కంటే పెద్ద పదం ఉంటే అది ఈ సినిమా “

-

sarileru neekevvaru pre release event : జనవరి 11న రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎల్బి స్టేడియంలోజరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మెగా సూపర్ ఈవెంట్ గా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సినిమాలో ఐటం సాంగ్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీనికి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఈ ఈవెంట్ లో రామ జోగయ్య శాస్త్రి మాట్లాడిన మాటలు హై లైట్ గా నిలిచాయి .. ఈ సినిమా కి బలం ఈ సినిమా లో ఉన్న నటీనటులే అని చెప్పారు ఆయన .. రత్నవేలు వర్క్ ఈ సినిమా కి బాగా కలిసి వచ్చింది అని ఆయన చెప్పారు.

అనిల్ రావి పూడి కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా కలిసొస్తోంది అని అన్నారు .. బ్లాక్ బుస్టర్ కన్నా పెద్ద పదం ఏదన్నా ఉంటే అది సరిలేరు నీకేవ్వరూ అంత గొప్ప సినిమా అవుతుంది అన్నారు ఆయన.. ఈ కథ నాకు ఎప్పుడో తెలుసు అన్న ఆయన .. కథ తెలుసు కాబట్టే అంతా ధైర్యంగా చెప్పగలుగుతున్నా అన్నారు .. తానూ రాసిన రెండు పాటలూ చాలా పెద్దగా హిట్ అవ్వడం హ్యాపీగా ఉంది అన్నారు ఆయన.. సినిమా లో కీలక మైనటువంటి సన్నివేశం లో వచ్చే పాట సూర్యుడివో చంద్రుడివో సాంగ్ రాయడం హ్యాపీగా ఉంది అన్నారు ఆయన.

Read more RELATED
Recommended to you

Exit mobile version