సర్పంచ్ అయినా… కుల వివక్ష మాత్రం మారలేదు..?

-

ఈ ఆధునిక ప్రపంచంలో రోజురోజుకీ టెక్నాలజీ మారుతుంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తమకు సరైన గుర్తింపు గౌరవం సంపాదించేందుకు ఎంతోమంది పోరాటం చేస్తూనే ఉన్నారు. ధైర్యం చేసి ఓ అడుగు ముందుకేసినప్పటికీ అడుగడుగునా ఎన్నో అవమానాల్ని మోస్తూనే ఉన్నారు. ఎంతో కష్టపడి ఉన్నత పదవిలో కొనసాగుతున్నప్పటికీ సరైన గౌరవాన్ని మాత్రం పొందలేకపోతున్నారు. ఆదివాసీలు ఇప్పటికీ కుల వివక్షను ఎదుర్కొంటున్నారు అని తెలపడానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనంగా మారింది. సర్పంచ్ పదవి లో ఉన్నప్పటికీ ఆదివాసి అనే కారణంతో ఆ మహిళకు సరైన గౌరవం లభించలేదు.

చివరికి అందరూ కుర్చీల మీద కూర్చుంటే సర్పంచ్ అయినప్పటికీ నేల మీద కూర్చొని సమావేశంలో పాల్గొనాల్సిన దుస్థితి వచ్చింది. కడలూరు లోని తెరకు పంచాయతీ సర్పంచిగా ఆదివాసి మహిళా ఎన్నుకోబడింది. అయినప్పటికీ గ్రామ పెద్దలు మాత్రం ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. చివరికి అందరూ కుర్చీల మీద కూర్చొని సమావేశంలో పాల్గొంటే ఆదివాసి మహిళ మాత్రం చివరికి నేల మీద కూర్చుని సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news