సార్వభౌమ బంగారం పథకం వచ్చేసింది

-

సార్వభౌమ బంగారం పథకంలో పెట్టుబడుల కోసం 2020–21 సిరీస్‌ను మార్చి 1 నుంచి 5 వరకు ప్రారంభమైంది. పథకం సెటిల్మెంట్‌ మార్చి 9. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టాలంటే ఒక గ్రాము బంగారం నుంచి మొదలై గరిష్టంగా 4 కిలోల వరకు వ్యక్తికి, హిందూ అవిభాజ్య కుటుంబాలకు 4 కిలోలు, ట్రస్టులకు 20 కిలోల వరకు వర్తిస్తాయి.

ముఖ్య ఉద్దేశం

ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. భౌతిక బంగారం డిమాండును తగ్గించాడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు బదులుగా, ఆర్థిక పొదుపుగా మార్చడం. ఈ లక్ష్యంతోనే సార్వభౌమ బంగారం పథకాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

సార్వభౌమ బంగారం పథకం ఇష్యూ ధర గ్రాముకు రూ. 4,662 గా నిర్ణయించారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ జారీ చేస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఉంది. అంటే ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేసిన వారికి గ్రాముకు రూ.4,612 ఉంటుందని సెంట్రల్‌ బ్యాంకు తెలిపింది.

ఈ ఏడాది 2020–21 సిరీస్‌

ఈ బాండ్‌ పూర్తి కాలం 8 సంవత్సరాలు, 5వ సంవత్సరం నుంచి మీ అవసరాలను బట్టి పథకం నుంచి నిష్క్రమణకు అనుమతి ఉంది. లేదా పూర్తికాలం వరకు కొనసాగవచ్చు. ప్రస్తుతం ఈ సార్వభౌమ బాండ్లను వ్యక్తులు అది కూడా కేవలం భారతీయులకు, ట్రస్టులకు, విశ్వవిద్యాలయాలకు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే అమ్మడానికే పరిమితం చేశారు.

ఈ సార్వభౌమ బంగారం పథకం బాండ్లను బ్యాంకులు (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మినహా) స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఊఎల్‌) ఎంపిక చేసిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్చ్సేంజీలు ద్వారా విక్రయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version