సత్యదేవ్ రేంజ్ పాన్ ఇండియా టార్గెట్..!!

తెలుగు లో వున్న హీరోలలో సత్యదేవ్ రూటు సెపరేటు. తాను సినిమాలో ఏ పాత్ర  చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ లో చేసిన సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవి తో సమానంగా నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ పాత్ర కు చిరంజీవి గారే స్వయంగా సత్యదేవ్ ను సూచించారు అంటే తన స్టామినా ను అర్ధం చేసుకోవచ్చు. తనని ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకోని డైరక్టర్ మోహన్ రాజా కు కూడా తన నటన తో ఆశ్చర్య పోయేలా చేసాడు.అలాగే బాలీవుడ్ లో వచ్చిన రామ సేతు లో సినిమా ఆడకున్నా తనకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

తనకోసం రచయితలు స్పెషల్ గా మంచి పాత్రలు రాస్తున్నారు.సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలకు సంతకం చేసి వున్నారు. అందులో ఒక సినిమా పుల్ బాటిల్. ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా హ్యూమరస్ గా వుంటుందట. ఈ సినిమాలో సత్యదేవ్‌ మెర్క్యూరి సూరి అనే కారెక్టర్ లో కనిపించనున్నారు. అలాగే తన లోని నటుణ్ణి ఇంకా మెరుగు పరిచే మరిన్ని పాత్రలు వస్తున్నాయి.

ప్రస్తుతం సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఎస్‌ఎన్‌.రెడ్డి , బాల సుందరం-దినేష్‌ సుందరం (ఓల్డ్‌టౌన్‌ పిక్చర్స్‌) నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ జరుపుకుంటోంది.’ఫైనాన్షియల్‌ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్నపాన్‌ ఇండియా చిత్రమిది.2023 ఫిబ్రవరి మొదటివారంతో షూటింగ్‌ పూర్తవుతుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వేసవిలో సినిమాని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.