మహిళల గురించి సంస్కారం లేకుండా మాట్లాడారు: సత్యవతి రాథోడ్

-

మహాలక్ష్మి పథకం లాంచింగ్ కార్యక్రమంలో మహిళలను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడారు అని సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళల గురించి సంస్కారం లేకుండా మాట్లాడారు అని అన్నారు. సభ్య సమాజం తల దించుకునే ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారు అన్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా చెప్పిన హామీలను అమలు చేయట్లేదు అని అన్నారు. మొదటి హామీ మహిళలకు 2500ఎందుకు ఇవ్వట్లేదు అన్నారు. మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్లు ఉంటేనే 500 లకు సిలిండర్ ఇస్తాము అంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళల పేరు మీదనే కనెక్షన్ ఉండాలని ముందు ఎందుకు చెప్పలేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news