WHATS UP : వాట్సాప్ అదిరిపోయే ఆఫర్‌.. ఇలా చేస్తే రూ.51 క్యాష్ బ్యాక్

-

ప్రస్తుత కాలంలో.. ప్రతి ఒక్కరి ఫోన్లోనూ వాట్సాప్ ఉంటున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపించు కోవడమే కాకుండా పేమెంట్స్ ఆప్షన్ ను కూడా ఈ మధ్యకాలంలో వాట్స్అప్ తీసుకు వచ్చింది. అయితే వాట్సాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసే కస్టమర్లను పెంచుకునేందుకు ఇప్పుడు మరో అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది ఆ కంపెనీ. తమ సమస్యలపై నమ్మకాన్ని పెంచేందుకు ఇప్పుడు క్యాష్బ్యాక్ ఆఫర్ ను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.

ముఖ్యంగా కేవలం ఒక్క రూపాయి పంపినా… కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వర్తిస్తుందని వాట్సప్ తెలిపింది. అయితే ఇందులో మాత్రం కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. వాట్స్అప్ ద్వారా 5 ట్రాన్సాక్షన్ ల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని… ఆ తర్వాత చెల్లించే వాటికి మాత్రం ఆ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది వాట్సప్. అయితే ఇక వాట్సాప్ ద్వారా వచ్చిన ఈ క్యాష్ బ్యాక్ వెంటనే మన అకౌంట్లో జమ అవుతుందట. కానీ ఈ ఆఫర్ వర్తించాలి అంటే ఆరు ఆండ్రాయిడ్ బీటా యూజర్లు అయి ఉండాలని షరతులు పెట్టింది వాట్సాప్. ఈ ఆఫర్ను అది త్వరలోనే తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది ఆ సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news