ఎస్‌బీఐ కొత్త ఆఫర్.. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా అకౌంట్‌..

-

దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కొత్త ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ పెహ్లా కదమ్, పెహ్లీ ఉడాన్ అనే రెండు కొత్త అకౌంట్లను అమలుచేస్తుంది. ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఈ ఖాతాను తెరవొచ్చు. అయితే ఈ అకౌంట్ల‌ను కేవలం చిన్న పిల్లల కోసమే కేటాయించింది. ఈ అకౌంట్ తీసుకున్న వారు అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా అన్ని ఖాతాలకు ఉన్నట్టుగా ఈ ఖాతాకు కూడా చెక్ బుక్ సౌకర్యం, ఏటీఎం సౌకర్యం ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ఖాతా ద్వారా పొందవచ్చు.

 

అంతేకాక ఈ అంకౌంట్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఒక్కో ఖాతాలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ ను కలిగి ఉండొచ్చు. ఈ ఖాతాలో కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది ఎస్ బీఐ. దీని ద్వారా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఖాతాపై చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇప్పుడు ఎస్ బీఐ కల్పించింది. ఈ ఏటీఎం కార్డు ద్వారా రోజుకు రూ.5,000 వరకు క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇక పోతే బిల్ పేమెంట్స్, టాప్ అప్స్ వంటి ఫెసిలిటీలు కూడా ఈ ఖాతాదారులకు ఉన్నాయి, వీటి ట్రాన్సాక్షన్ పరిమితి మాత్రం రూ.2,000 మించకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version